calender_icon.png 10 September, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుద్రారంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు

10-09-2025 05:11:16 PM

భారీ సంఖ్యలో భక్తులు సిద్ది గణపతిని దర్శించుకున్నారు..

పటాన్ చెరు (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పటన్ చెరు ప్రముఖ టీవీ నటుడు పవన్ సాయి సంకష్టహర చతుర్థి సందర్భంగా రుద్రారంలోని ప్రసిద్ధ శ్రీ గణేష్‌గడ్డ దేవస్థాన సిద్ది గణపతి దర్శించుకుని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. ఆయన మిత్రులు కిషోర్ కుమార్, శ్రీకాంత్ కూడా ఉన్నారు. పవన్ రాకతో ఆలయంలోని భక్తులు ఆశ్చర్యపోయారు. చాలామంది ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించగా, నటుడు అందరితో కలిసి సంతోషంగా ఫొటోలు దిగారు. శ్రీ గణేష్‌గడ్డ దేవాలయంపై పవన్ సాయి ఆలయాన్ని సందర్శించిన తర్వాత పవన్ సాయి మీడియాతో మాట్లాడుతూ.. తన జీవితంలో మొదటిసారి ఈ దేవాలయాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గణేష్‌గడ్డ దేవాలయం కోరికలు తీర్చే శక్తివంతమైన దేవాలయమని విన్నానని, అందుకే సంకష్టహర చతుర్థి రోజున ఇక్కడికి వచ్చానని తెలిపారు.

చిన్నప్పటినుంచి వినాయకుడు తనకు ఇష్టదైవమని, అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. ఆలయంలో 108 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని అన్నారు. పవన్ సాయి నటించిన సీరియల్స్ గతంలో ముద్దమందారం, మొగలిరేకులు, నాగ భైరవ వంటి ప్రముఖ సీరియల్స్‌లో నటించారు. ప్రస్తుతం ఘరానా మొగుడు అనే సీరియల్‌లో నటిస్తున్నారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా గణేష్‌ గడ్డ దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని, ప్రదక్షిణలు చేసి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించారు.