calender_icon.png 10 September, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ చట్టపరమైన హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

10-09-2025 05:07:38 PM

ఎస్ఐ గోపికృష్ణ..

పెన్ పహాడ్: ప్రతి ఒక్కరూ చట్టపరమైన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఎస్సై గోపికృష్ణ(SI Gopikrishna) అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం, అనాజిపురంలో ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు పోలీస్ భరోసా కార్యక్రమంలో భాగంగా పలు చట్టాలపై అవగాహన కల్పించారు. చట్టాలపై అవగాహనతో పాటు సమాజంలో బాధ్యతగల పౌరులుగా గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్, పోక్స్ యాక్ట్ పై అవగాహన కల్పించడంతో పాటు, ముఖ్యంగా అమ్మాయిల భద్రత, రక్షణ, చట్టపరమైన హక్కులపై విద్యార్థులకు పోలీస్ కళా బృందంతో ఆట -పాటల ద్వారా చైతన్యం కలిగించారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ కోడి లింగయ్య, ఉమెన్ పీసీ శైలజ, ఉపాధ్యాయులు జి. సోమయ్య, ఎస్. వెంకన్న, విద్యార్థులు ఉన్నారు.