calender_icon.png 10 September, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్ పుష్పనగేష్

10-09-2025 04:57:37 PM

రామచంద్రపురం (విజయక్రాంతి): రామచంద్రాపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ బాలవిహార్ పార్క్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఈరోజు స్థానిక కాంగ్రెస్ నాయకులు, రజకులతో కలిసి రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్(Corporator Burugadda Pushpa Nagesh) పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, తెలంగాణ తొలి భూపోరాట వీరవనిత చాకలి ఐలమ్మ, నిజాం రజాకార్ల అరాచకాలకు, నిరంకుశత్వానికి, బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ జ్యోతి అని తెలిపారు. చిట్యాల ఐలమ్మ పోరాటం తెలంగాణ చరిత్రలో వెలకట్టలేనిదని, బడుగు జీవుల అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ఆమె బందుకులు పట్టి సమానత్వం కోసం పోరాడారని గుర్తుచేశారు. ఐలమ్మ స్ఫూర్తి తోనే నేటి తరాలు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ కావాలి నగేష్, మాజీ ఏఎంసి డైరెక్టర్ ఐలాపూర్ ఐలేష్, పీటర్ పాల్స్, మైనారిటీ అధ్యక్షులు హబీబ్ జానీ, శాంతమ్మ, నవీన్ గౌడ్, బైకన్ నవీన్ యాదవ్, రాంజీ, చాకలి నర్సింహ, చాకలి శ్రీను, నర్సింహ, హన్మంతు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.