calender_icon.png 10 September, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన గ్రీన్ గ్రోవ్ విద్యార్థులు

10-09-2025 04:54:01 PM

చౌటుప్పల్ (విజయక్రాంతి): చౌటుప్పల్ మున్సిపాలిటీ(Choutuppal Municipality) పరిధిలోని తంగడిపల్లి గ్రామంలో 69వ పాఠశాలల క్రీడల సందర్భంగా ముస్కు మధుసూదన్ రెడ్డి స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్ జి ఎఫ్)  నిర్ణయించిన కబడ్డీ, వాలీబాల్, క్రీడలలో చౌటుప్పల్ పట్టణ పరిధిలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు  టి. హర్షిత్ రెడ్డి, కె జయచంద్ర లు సీనియర్ వాలీబాల్ విభాగంలో బి. నిఖిల్ రెడ్డి , కె సాత్విక్, సీనియర్ కబడ్డీ విభాగంలో, ఎన్ నిరూప్ కుమార్, ఏ సాత్విక్ లు జూనియర్ కబడ్డీ విభాగం లో జిల్లాస్థాయికి ఎంపిక అయినట్లు ఎస్ జి ఎఫ్ నిర్వాహకులు తెలియజేశారు. చక్కని ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థులు తదుపరి నిర్వహించే జిల్లాస్థాయి క్రీడల్లో పాల్గొంటారని  తెలియజేశారు. విద్యార్థులను, పాఠశాల క్రీడా ఉపాధ్యాయుడు  సందీప్ ని  ,పాఠశాల చైర్పర్సన్  బండి వీణ అనిల్ కుమార్ రెడ్డి ,పాఠశాల డైరెక్టర్ ఎస్ లక్ష్మి , ఉపాధ్యాయులు ,తల్లిదండ్రులు అభినందించారు.