calender_icon.png 10 September, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి

10-09-2025 04:51:51 PM

మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య..

హుజురాబాద్ (విజయక్రాంతి): ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందుగల ఐలమ్మ చౌరస్తాలో గల విగ్రహానికి పూలమాలలు వేసి బుధవారం 40వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేట్టి చాకిరి బానిస బతుకులు అనుభవిస్తూ మాన ప్రాణాలు దక్కితే చాలనుకునే పరిస్థితుల్లో దొరలు, దేశ్ముఖులు రజాకార్ల జగడాలని ధైర్యంగా ఎదుర్కొనే పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. రజక సంఘం యువజన అధ్యక్షుడు సాయి కృష్ణ మాట్లాడుతూ.. దొరల దాస్టికానికి లొంగకుండా బంచేన్ దొర కల్మొక్త అని అనకుండా ఎదురు తిరిగి పోరాటం చేసిన ఘనత ఐలమ్మదన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ రజక సంగం  అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, హనుమాన్ దేవస్థానం చైర్మన్ కొలిపాక శంకర్, రజక సంఘం నాయకుడు మాజీ కౌన్సిలర్ నల్ల సుమన్, హుజురాబాద్ మండల అధ్యక్షుడు సుంకరి రాజమౌళి, కౌన్సిలర్ ముక్క రమేష్, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్, మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, కొలిపాక శ్రీనివాస్, తెలంగాణ రామ్ రెడ్డి, నల్ల సదానందం, మున్సిపల్ సిబ్బంది ప్రతాప రాజు తోపాడు తదితరులు పాల్గొన్నారు.