04-11-2025 07:47:39 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఇన్చార్జి రవాణాశాఖ అధికారిగా శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో జిల్లా రవాణా శాఖ అధికారిగా శ్రీనివాస్ రెడ్డి పనిచేసి ఇటీవల స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. దీంతో ఆయన స్థానంలో ఇంచార్జ్ రవాణా శాఖ అధికారిగా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. వాహనదారులు లైసెన్సుల కోసం నేరుగా వచ్చి పొందవచ్చని తెలిపారు. బ్రోకర్లను ఆశ్రయించవద్దని ఆయన సూచించారు.