calender_icon.png 1 August, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలకు వ్యతిరేకంగా శ్రీరతన్ కన్స్ట్రక్షన్

31-07-2025 10:48:18 PM

 వర్షాకాలంలో సెల్లార్ తవ్వకం...

 ప్రహరీ గోడ కూలి స్థానికుల కార్లు ధ్వంసం..

 పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు...

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): నిజాంపేట్ లో శ్రీరతన్ కన్స్ట్రక్షన్ నిబంధనలకు వ్యతిరేకంగా వర్షాకాలంలో సెల్లార్ తవ్వకాలకు బరితెగించింది. హెచ్ఎండీఏ అనుమతులు పొంది దాదాపు 22 ఫ్లోర్స్ తో నిర్మిస్తున్న శ్రీరతన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అపార్ట్మెంట్ నిర్మాణం ఓ పక్క చేపడుతూనే మరో పక్క క్లబ్ హౌస్ నిర్మాణానికి తెరలేపింది. అయితే క్లబ్ హౌస్ నిర్మాణం కోసం గురువారం భారీ సెల్లార్ తవ్వకం  మొదలు పెట్టింది.శ్రీరతన్ కన్స్ట్రక్షన్ చేస్తున్న స్థలం పక్కనే కొన్ని రెసిడెంట్స్ అపార్ట్మెంట్స్ సముదాయాలు ఉన్నాయి.అయితే హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ నిబంధనలు ప్రకారం మన్సూన్ సీజన్ వర్షాకాలంలో ఏ కన్స్ట్రక్షన్ కంపనీ కూడా సెల్లార్ తవ్వకాలు చేపట్ట రాదు.గతంలో వర్షాకాలంలో నిబంధనలకు విరుద్ధంగా తీసిన సెల్లార్ల  వల్ల ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించింది.

 నిబంధనలు తుంగలో తొక్కిన శ్రీరతన్ కన్స్ట్రక్షన్....

నిబంధనలు గాలికి వదిలేసిన శ్రీరతన్ కన్స్ట్రక్షన్ కంపనీ గురువారం సాయంత్రం సెల్లార్ తవ్వకాలను చేపట్టి స్థానికంగా భయానక వాతావరణం సృష్టించింది.ఏమాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా భారీ స్థాయిలో సెల్లార్ తవ్వకానికి సదరు కన్స్ట్రక్షన్ కంపనీ పూనుకోవడంతో పక్కనే గల ధీక్షిత్ ఎంక్లేవ్ అపార్ట్మెంట్ సముదాయ ప్రహరీ కూలడంతో పాటు కొన్ని కార్లు ధ్వంసం అయ్యాయి.ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో ఇప్పుఫు సెల్లార్ తవ్వకం చేపట్టవద్దూ అని స్థానిక అపార్ట్మెంట్ నివాసితులు శ్రీరతన్ కన్స్ట్రక్షన్ భాద్యులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు.

దీంతో సదరు కన్స్ట్రక్షన్ కంపెనీ గురువారం సెల్లార్ తవ్వకంతో ధీక్షిత ఎంక్లేవ్ వాసులకు భయానక పరిస్థితి ఏర్పడింది. ప్రహరీ కూలి కార్లు డ్యామేజ్ కావడంతో పాటు అపార్ట్మెంట్ పిల్లర్లు కదిలే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.సదరు కన్స్ట్రక్షన్ కంపనీ చట్ట వ్యతిరేక చర్యలపై బాచుపల్లి పోలీసులకు స్థానిక అపార్ట్మెంట్ నివాసితులు ఫిర్యాదు చేయడంతో పనులు ఆపి వేయించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న శ్రీరతన్ కన్స్ట్రక్షన్ సంస్థ పై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.