calender_icon.png 1 August, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకకాలంలో విస్తృతంగా పోలీసుల తనిఖీలు

31-07-2025 10:51:34 PM

అదిలాబాద్,(విజయక్రాంతి): నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు నాకాబంది నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహజాన్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7:30 వరకు జిల్లాలో పూర్తిగా జిల్లా సరిహద్దుల్లో, పట్టణాల్లో ఏకకాలంలో డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నాకాబంది నిర్వహించారు. మొత్తం 20 పోలీస్ స్టేషన్ ల పరిధిలో నిర్వహించిన నాకాబందిలో 36 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు, నంబర్ ప్లేట్ లేని 41 వాహనాలు, 15 సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పురుగుల మందు బాటిళ్లు తరలిస్తున్న ఒక కారు స్వాధీనం చేసుకుని, నిందితుడు రామేశ్వర్ పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.