01-08-2025 06:24:14 PM
హనుమకొండ (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ గౌరవ సభ్యులు, వారి కుటుంబాల కోసం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం చేయిస్తున్న ఇన్సూరెన్స్ పాలసీల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింది. శుక్రవారం ఫోటో, వీడియో జర్నలిస్టులతో పాటుగా పలువురు జర్నలిస్టులు తమ దరఖాస్తు ఫారాలను నింపి సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, కోశాధికారి బొల్ల అమర్, ఉపాధ్యక్షులు గోకారపు శ్యాం, బొడిగె శ్రీను, జాయింట్ సెక్రెటరీలు డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్, సంపెట సుధాకర్, ఈసీ సభ్యులు ఎండీ నయీంపాషా, వీడియో జర్నలిస్టులు గొర్రె సంజీవ్, సుంచు రామరాజు,సునీల్, జర్నలిస్టులు రోజనాల శ్రీనివాస్, రంజిత్, పాటి నరెందర్, బూరం ప్రశాంత్, అశోక్, రమేశ్, గెట్టె వెంకన్న, సుధీర్, ఇస్మాయిల్, నూటంకి ప్రభాకర్, ఖాదర్ పాషా, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.