06-09-2025 12:56:25 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ప్రజలందరిపై వినాయకుడి ఆశీస్సులుండాలని ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రా మంలో స్థానిక నాయకులు, యూత్ అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు స్థానిక వినాయక మండపాలను సందర్శించి, కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మం డల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాష్ర్ట ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్ నాయక్, తాజా మాజీ సర్పంచ్ కర్ర రవీందర్ రెడ్డి, ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ ప్రతినిధు లు లేతకుల సుధాకర్ రెడ్డి, లేతకుల మధుకర్ రెడ్డి, గజావెల్లి ప్రసాద్, ఎండీ యూసఫ్, కోలా సంపత్ తదితరులు పాల్గొన్నారు.