calender_icon.png 6 September, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది

06-09-2025 12:57:23 AM

  1. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలువురి ఉపాధ్యాయులకు సన్మానం

హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

ముషీరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని, ఉపాధ్యాయుడు ఉత్తమ సేవలందించినప్పుడే తగిన గుర్తింపు లభిస్తుందని హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాంనగర్ లోని ఆయన నివాసంలో పలువురి ఉపాధ్యాయులను శాలువాలు,  పూల మాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సంద ర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూ దేశ ఉప ప్రధాని వరకు ఎదిగిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు.  విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.