06-09-2025 12:55:58 AM
డూప్లెక్స్ ఫ్లాట్ ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయలేదంటూ ఆరోపణలు
అసత్య ప్రచారం చేస్తున్నారంటూ అంజిబాబు వివరణ
మణికొండ, సెప్టెంబర్ 5: చిత్రపురి కాలనీలో మరో వివాదం మొదలైంది. పత్తిపాటి అంజిబాబు డూప్లెక్స్ హౌస్‌ను ఇస్తామం టూ ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ నుంచి 95 లక్ష ల రూపాయలు తీసుకున్నారని, ఫ్లాట్ కేటాయించకుండా అతన్ని బెదిరిస్తున్నారంటూ వివాదం చెలరేగింది. చిత్రపురి కాలనీలోని వాట్సాప్ గ్రూప్ లలో ఈ ఫ్లాట్ కేటాయింపు గురించి ఆరోపణలు వస్తున్నాయి. మాజీ సీఎం రోశయ్యకు పీఏగా పనిచేస్తూ చిత్రపురి చేరారని ప్రచారం జరిగింది.
దీనిపై పత్తిపాటి అంజిబాబు వివరణ ఇచ్చారు. అంజిబాబు మాట్లాడుతూ - నేన సెకండ్ సేల్ కింద ఫ్లాట్ అమ్మకానికి అగ్రిమెంట్ చేసుకున్నాను. అయితే ఆ ఫ్లాట్ చిత్రపురి ఆఫీస్ వారు మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారనే విష యం తర్వాత నా దృష్టికి వచ్చింది.
దాంతో నేను అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తికి డబ్బులు తిరిగి ఇస్తానని ప్రామిసరీ నోట్ ఇచ్చాను. మేము పరస్పరం ఒప్పందానికి వచ్చాం. ఇం తలో కొందరు అక్రమంగా ఫ్లాట్ విక్రయించి మోసం చేశానంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. నేను 2005 నుంచే చిత్రపురి కాలనీలో మెంబర్ ను. ఏమాత్రం సంబంధం లేని మాజీ సీఎం రోశయ్య పేరును కూడా ఈ వివాదంలోకి లాగడం బాధాకరం. అన్నారు.