చెరువుగా మారిన స్టేడియం!
క్రీడాకారులు, వాకర్స్‌కు తిప్పలు
మహబూబాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): చిన్నపాటి వర్షానికే మహబూబా బాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం చెరువుగా మారి క్రీడాకారులకు, వాకర్స్ కు ఇబ్బందిగా మారుతోంది. జిల్లా కేంద్రంలో వందల మంది క్రీడాకారులు, వాకర్స్ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్టేడియంకు వచ్చి క్రీడల్లో ప్రావీణ్యం పొందడానికి ఆటలాడడం, వాకర్స్ మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ నిర్వహించడం జరుగుతుంది. ఆదివారం రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికి సే ్టడియం పూర్తిగా వరద నీటితో నిండిపోయి చెరువును తలపించింది.
దీనితో ఉదయం క్రీడా శిక్షణ కోసం, వాకర్సు కాలినడక చేయడానికి రాగానే స్టేడియం కాస్త చెరువుగా మా రడంతో నివ్వెర పోయారు. స్టేడియంలో వా కర్స్ ట్రాక్, ఇతర అభివృద్ధి పనుల నేపథ్యంలో లెవలింగ్ సరిగా చేయకపోవడం, వ రద నీరు బయటకు వెళ్లే విధంగా చర్యలు చే పట్టకపోవడంతో కొద్దిపాటి వర్షానికే స్టేడియం పూర్తిగా నీటితో నిండిపోయిందని ఆరోపిస్తున్నారు.
స్టేడియంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ ముం దుకు రావడంలేదని, స్పోరట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధీనంలో ఉన్న స్టేడియం అభివృద్ధికి క్రీడల శాఖ పెద్దగా శ్రద్ధ చూప డం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇరు శాఖల సమన్వయ లోపంతో క్రీడాకారులకు, వాకర్స్ కు ఎన్టీఆర్ స్టేడియం ఇప్పుడు అసౌకర్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్రీడాకారులకు, వాకర్స్ కు స్టేడియంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం అప్పటి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ దృష్టికి తీసుకువెళ్లగా కొన్ని సౌకర్యాలను కల్పించారని, అయితే స్టేడియం ఆవరణ సరిగా లేకపోవడం వల్ల వరద నీరు తిష్ట వేస్తుందని చెబుతున్నారు.
ప్రస్తుతం స్టేడియంలో నిలిచిన వరద నీరును బయటకు పంపే విధంగా తక్షణం చర్యలు చేపట్టాలని, స్టేడియంలో లెవెలింగ్ పనుల్లో జరిగిన లోపాలను సరిదిద్ది, నీరు దిగువకు నేరుగా వెళ్లే విధంగా ప్రత్యేక డ్రైనేజీ నిర్మించాలని, స్టేడియంలో సమస్యల పరిష్కారానికి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా జిల్లా క్రీడా శాఖ అధికారి, మున్సిపాలిటీ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని మహబూబాబాద్ అట్లాంటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు లయన్ బొడ్డుపల్లి ఉపేంద్రం, వాకర్స్ అసోసియేషన్ కోశాధికారి సోమ విష్ణువర్ధన్ కోరుతున్నారు.






