26-01-2026 05:51:23 PM
రెండు లక్షలతో నిర్మించిన మాజీ ఎంపీపీ
ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు హర్షం
కామారెడ్డి,(విజయక్రాంతి): కుమారుడు జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే స్టేజి నిర్మాణం చేపట్టి ఇచ్చాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో మాజీ ఎంపీపీ తొగరి సుదర్శన్ తన కుమారుడు రంజిత్ కుమార్ జ్ఞాపకార్థం విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా రెండు లక్షలతో స్టేజి నిర్మాణం చేపట్టి 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రారంభించారు. మాజీ ఎంపీపీ తొగరి (బైండ్ల) సుదర్శన్, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా స్టేజి నిర్మాణం చేయించి ఇవ్వడం పట్ల విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామస్తులు సుదర్శన్ ను అభినందించారు.