calender_icon.png 26 January, 2026 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 08:21:57 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలు పరిరక్షణకు దేశ పౌరులు కృషి చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి తోటపల్లి శంకర్ పిలుపునిచ్చారు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సిపిఐ కాప్రా మండల సమితి ఆధ్వర్యంలో కాప్రా మండల సిపిఐ కార్యదర్శి దర్శనం యాదగిరి అధ్యక్షతన రావి నారాయణరెడ్డి నగర్ (సిపిఐ కాలనీ) సిపిఐ ఆఫీసు ముందు జెండా ఎగరవేశారు. 

ఈ సందర్భంగా *సిపిఐ మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జ్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పాలకులు ప్రజారంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో కార్పోరేట్ వర్గాలకు అప్పగిస్తూ పేద ప్రజల జీవితాలను మరింత దుర్భరంగా మారుస్తున్న అన్నారు. నిరుద్యోగం. ధరల పెరుగుదల రైతు సంక్షోభం దేశాన్ని కుదిపేస్తున్న అన్నారు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ విలువలను రక్షించేందుకు ప్రజాస్వామ్య హక్కుల కోసం శ్రమజీవుల ఐక్యతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కమ్యూనిస్టు పార్టీ పిలుపునిస్తుందన్నారు. ప్రజలే నిజమైన పాలకులు అన్న సత్యాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు సమిష్టి పోరాటాలు ఆవశ్యకత ఎంతైనా ఉందని తోటపల్లి శంకర్ అన్నారు.