26-01-2026 08:12:32 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 77వ రిపబ్లిక్ డే వేడుకలు మండల కేంద్రంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో దేశం సర్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రంగా అవతరించిందని గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛలను ప్రతి పౌరుడు కాపాడవలసిన బాధ్యత ఉందన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేయడంలో అధికారులు,ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ్యతయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు రెడ్డి, ప్రధాన కార్యదర్శి దివిటీ కిష్టయ్య, సీనియర్ నాయకులు సంజీవులు, రామచంద్రారెడ్డి, కిష్టాపూర్, బెస్త సాయిలు, గంపల వెంకన్న, ఫారూఖ్, ఈమామ్, సాయ గౌడ్,హనుమాన్లు, తదితరులు పాల్గొన్నారు.