26-01-2026 08:51:00 PM
గ్రామ గ్రామాన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ మండలంలో గ్రామ గ్రామాన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయాన్నే మండలంలోని గ్రామాల్లో ఆయా గ్రామాల పాఠశాల విద్యార్థులు, యువకులు జాతీయ గీతాలాపనలు చేస్తూ ప్రధాన రహదారుల వెంబడి ర్యాలీలు నిర్వహిస్తూ గ్రామాలలో మువ్వన్నెల జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
మండల కేంద్రంలో గల ప్రభుత్వ కార్యాలయాలు పోలీస్ స్టేషన్లో ఎస్సై భార్గవ్ గౌడ్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,తాసిల్దార్ కార్యాలయం వద్ద డిప్యూటీ తహసిల్దార్ రాజేశ్వర్,అడవి శాఖ కార్యాలయం వద్ద ఎఫ్ఆర్ఓ వాసుదేవ్,మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏవో సాయికిరణ్ కస్తూర్బా మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్స్ గీత రాంప్రసాదులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మండలంలో గల గ్రామాలలోని జిపి కార్యాలయాల వద్ద నూతన సర్పంచులు మొదటిసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సందర్భంగా ఆయా గ్రామాల్లోని పాఠశాలలలో విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలపై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు, సర్పంచులు,ప్రజా ప్రతినిధులు,విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.