26-01-2026 08:43:43 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): గృహిణి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాశివాణి సింగారంకు చెందిన ఆడేపు యాదగిరి అతని భార్య ఆడెపు వాసవి (38) వారికి ఇద్దరు పిల్లలు, తన భార్య వాసవి ఫోన్లో మాట్లాడుతున్నదని భర్త మందలించడంతో ఈనెల 18వ తేదీ సాయంత్రం ఏడున్నర గంటలకు ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికిన ఆచూకీ లభించకపోవడంతో ఈ విషయంపై భర్త మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని, మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి తెలిపారు.