calender_icon.png 26 January, 2026 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ విలువలను కాపాడుతూ పని చేయాలి

26-01-2026 08:08:47 PM

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర  

కామారెడ్డి,(విజయక్రాంతి): రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజాసేవలో నిబద్దతతో పనిచేయాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర,  జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి భావాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ  సూచించారు.