09-04-2025 02:20:48 AM
జనగామ, ఏప్రిల్ ౮ (విజయక్రాంతి): జనగామ జిల్లాలో 108 వాహనాల్లో పనిచేస్తున్న పైలట్లకు ఉత్తమ అవార్డులు లభించాయి. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రులకు చేరవేయడం, వెహికల్ గుడ్ మెయింటనెన్స్, షెడ్యూల్ సర్వీస్‌లో అత్యుత్తమ ప్రతిభ చాటినందుకు గానూ పైలట్లు కె.రాజన్న, జి.అనిల్‌కు స్టార్ అవార్డులు ఇచ్చారు. మంగళవారం జనగామ ప్రోగ్రాం మేనేజర్ ఎస్‌కె.నసీరుద్దిన్, జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్‌చేతులమీదుగా ఈ అవార్డులు అందజేశారు.