22-08-2025 02:16:28 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 21 (విజయక్రాంతి): నారాయణ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు బణిబ్రత, అక్షత్ శ్రీవాస్తవ ముంబైలో ఆగస్టు 11 నుంచి 21 వరకు జరిగిన ప్రతిష్ఠాత్మకమైన 18వ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ -2025లో బంగారు పతకాలు సాధించారు.
ఈసారి ప్రపంచదేశాలతో పోటీ పడి మరీ భారత్ ఈ పోటీలు నిర్వహించింది. భారత్ తరఫున గ్లోబల్ వేదికపై పోటీ పెడ్డ బణిబ్రత, అక్షత్ 300 మంది ప్రపంచంలోని ప్రతిభావంతులైన విద్యార్థులతో పోటీపడి స్వర్ణ పతకాలు సాధించుకున్నారు. భారత్ తరపున మొత్తం 4 బంగారు పతకాలు, 1 రజత పతకం సాధించగా, అందులో 2 బంగారు పతకాలు నారాయణ విద్యార్థులే సాధించటం విశేషం.
ఈ పోటీలో విజయం సాధిం చిన బణిబ్రత జేఈఈ మెయిన్ 2025లో ఆలిండియా టాపర్‌గా నిలిచారు. ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పి.సింధూర నారాయణ మాట్లాడుతూ ‘బణిబ్రత, అక్షత్ ప్రతిభపై మాకు అపారమైన నమ్మకం ఉంది.
అంతే కాదు వారు ఎలాంటి వేదికపైనైనా అలవోకగా విజయం సాధించగలరు. వీరి విజయం కేవలం నారాయణకే కాకుండా యావత్ భారతదేశానికి గర్వకారణం’ అని పేర్కొన్నారు. నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ శరణి నారాయణ మాట్లాడుతూఈ రెండు బంగారు పతకాలు మా విద్యార్థుల ప్రతిభ, పట్టుదల, కష్టానికి నిదర్శనమన్నారు.