25-07-2024 02:20:00 AM
మధ్యాహ్నం 12 గంటలకు
శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి, మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు
అసెంబ్లీ కమిటీ హాలులో ఉదయం 9 గంటలకు క్యాబినెట్ భేటీ
2024 బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్న మంత్రివర్గం
ఆగస్టు 2 వరకు అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్, జులై 24 (విజయక్రాంతి): గురువారం రాష్ట్ర శాసనసభ, మండలిలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మండలిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 2024 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత ఉభయ సభలు వాయిదా పడు తాయి. అంతకుముందు ఉదయం 9 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనుంది. 2024 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.
2 వరకు అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మరో రెండు రోజులు పొడి గించాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నది. ఈ నెల 31న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత వాయిదా వేయాలని ముందుగా భావించారు. కానీ, పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం 1,2వ తేదీల్లో సభ నిర్వహించి.. ఆమోదించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. గురువారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా మరుసటి రోజు అంటే 26న సెలవు ప్రకటించారు. 28న ఆదివారం కావడం, హైదరాబాద్‌లో బోనాల పండుగ ఉండటంతో అసెంబ్లీకి సెలవు ఇచ్చారు.