01-11-2025 07:24:37 PM
అభినందించిన ఉట్నూర్ ఐటీడీఏ పీవో...
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రాష్ట్ర స్థాయి అవార్డు రావడం అభినందనీయమని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. శనివారం ఐటీడీఏ కార్యాలయంలో పీవో ఖుష్బూ గుప్తా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.12వేల చెక్కుతో పాటు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించిన జీజ్ఞాస ప్రాజెక్టులో ఉట్నూర్ డిగ్రీ కళాశాల నుండి తెలుగు విభాగం ఉత్తమ ప్రతిభ కనబరచి, రాష్ట్ర స్థాయి అవార్డు అందుకోవడం గొప్ప విజయమని పేర్కొన్నారు.
తెలుగు అధ్యాపకురాలు యోగా లక్ష్మీ మార్గదర్శకత్వంలో ఆదిలాబాద్ జిల్లా తోటీలు - జీవన స్థితిగతులు అనే అంశంపై రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్ర స్థాయి 24 ఉత్తమ ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత హైదరాబాద్ లో 24 ప్రాజెక్టులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పోటీ పడగా ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తృతీయ స్థానంలో నిలిచిందని ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్ పీవో కు తెలియజేశారు. దీంతో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా కళాశాల అధ్యాపక బృందంతో, పాటు విద్యార్థులను అభినందించారు