రైతుబంధు ఇవ్వకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం
ఏప్రిల్ 28న కరీంనగర్‌లో రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభ
రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు
ముషీరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): వారం రోజుల్లో రైతుబంధు ఇవ్వకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని, అన్నదాతలను ఆదుకో వడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమై యిందని రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు ఆరోపించారు.
ఈ మేరకు సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతులతో కలసి ఆయన రైతు మహాగర్జనకు సం బంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు అని చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి.. రైతు బంధు వేస్తే రైతులు తాగి తూలుతున్నారని రైతుల పట్ల వ్యంగ్యంగా మాట్లాడడం సబబు కాదన్నారు. తక్షణమేవారం రోజుల్లో రైతుబంధు నిధులు విడుదల చేయాలని, లేనిపక్షంలో ఈనెల 16న ప్రారంభం అయ్యే అసెంబ్లీని వేలాది మంది అన్నదాతలతో కలసి ముట్టడిస్తామని రామారావు హెచ్చరించారు.
రైతుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 28న కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయిలో రైతుల మహాగర్జన సమర భేరిని లక్షలాది మందితో నిర్వహిస్తామ ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షుడు భద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి, రైతుమిత్ర ప్రజాసంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామి రెడ్డి, రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బట్టంగారి మాధవ రెడ్డి, ఆర్య వైశ్య సంఘాల జేఏసీ చైర్మన్ అయిత నాగరాజు, వెలమ సంఘం జేఏసీ కన్వీనర్ జనగామ కరుణాకర్ రావు, వివిధ జిల్లాల ఐకాస, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.




