calender_icon.png 19 January, 2026 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు ప్రారంభం

09-11-2024 12:05:49 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ క్రీడా మైదానంలో శనివారం రాష్ట్రస్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ బాల్ పోటీలను బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలను బెల్లంపల్లిలో నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీలలో పాల్గొనే విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో మెదలాలని సూచించారు. క్రీడల్లో చక్కని ప్రతి పని కనబరిచి విద్యార్థులు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. పోటీలను బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ సందర్శించారు. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల నుండి 320 మంది క్రీడాకారులతో పాటు 40 మంది నిర్వాహకులు హాజరయ్యారు.

ఈ పోటీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కళాశాలల గేమ్స్ అండ్ ఫెడరేషన్ కార్యదర్శి బి.బాబురావు, డి ఐ ఈ ఓ కె .అంజయ్య, నిజామాబాద్ ఫిజికల్ డైరెక్టర్ గంగ మోహన్, ఆదిలాబాద్ జిల్లా పిడి ఎన్. స్వామి, ఆర్గనైజర్ ఎనగందుల వెంకటేష్, మంచిర్యాల జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు కె. రామ్మోహన్, ఎండి యాకుబ్, రాజ్ మహమ్మద్, బండి రవి, ఎండి. చాంద్ పాషా, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్, చిన్నక్క, యాదగిరిలు పాల్గొన్నారు.