calender_icon.png 20 January, 2026 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమాటీల కొలువులు కొనసాగేనా?

09-11-2024 12:00:41 PM

మమ్ములను ఏ ప్రాతిపదికన తీసుకున్నారో మాకు తెలియాలి..

కోదాడ (విజయక్రాంతి): గత మూడు సంవత్సరాల నుండి కోదాడ మున్సిపాలిటీలో 110 మంది కమాటీలు కొలువు చేసుకుంటూ కుటుంబ పోషణ కొనసాగిస్తున్నారు. కానీ వారికి ఏ ప్రాతిపదికన కొలువులు కేటాయించారో తెలియని పరిస్థితి. గత ఆరు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. సంబంధిత అధికారులకు విన్నవించుకున్న వారికి జీతాలు రాకపోవడంతో శనివారం ఉదయం విధులకు వెళ్లకుండా మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు కామాటీలు మాట్లాడుతూ.. మాకు వచ్చేదే నెలకు 11,500 జీతం ఆ జీతం తోటి మా కుటుంబాన్ని పోషించుకుంటూ మా పిల్లలను చదివించుకోవడం మాకు ఎంతో ఇబ్బందిగా ఉన్నది అయినా సరే ఇంకా కొన్నాళ్ళకు మా బతుకులు మారుతాయి అని మేము కమాటి కొలువులు చేస్తూ కోదాడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నిత్యం శ్రమిస్తున్నాము. అయినా సరే మా జీతాలు ఇవ్వడంలో సంబంధిత అధికారులు అలసత్వం వహిస్తున్నారు. మాకు జీతాలు రాక కుటుంబ పోషణ భారం అయ్యి పిల్లల ఫీజులు కట్టక స్కూల్ నుంచి పంపుతున్నారు అని వేడుకున్నా కూడా మా జీతాలు వేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో నిరసన తెలియజేశామని అన్నారు.

గత ప్రభుత్వంలో రెండు నెలలకు ఒకసారి జీతాలు వేశారు. ఈ ప్రభుత్వంలో ఇంతవరకు మాకు జీతాలు రాలేదని అన్నారు. మధ్యలో ఒకసారి ఏసినా ఆరా కోరగా చాలీసాలను జీతం వేశారని అన్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న బడ్జెట్ లేదని చెప్పుకుంటూ వస్తున్నారు. అసలే చాలీసాలని జీతాలతో మా జీవితాన్ని సాగదీస్తుంటే ఆరు నెలలుగా జీతాలు లేకపోవడంతో పూర్తిగా ఇబ్బందులు పడుతూ బయట నుంచి వడ్డీలకు తెచ్చుకొని జీవనం సాగించాల్సి వస్తుందని అన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మా జీతాలు మాకేసి మా కుటుంబాలు రోడ్డును పడకుండా చూడాలని అన్నారు.