09-11-2024 12:13:43 PM
కరీంనగర్ (విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి జ్యోతిదేవి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె భర్త కొమొరెడ్డి రాములు సైతం మెట్‌పల్లి ఎమ్మెల్యేగా సేవలందించారు. గతేడాది ఆయన కన్నుమూశారు. జ్యోతక్క మృతితో కోరుట్ల నియోజకవర్గంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతి వార్త తెలియగానే జ్యోతక్క సమీప బంధువు అయిన హైకోర్టు న్యాయమూర్తి ఈవి వేణుగోపాల్, సోదరుడు ఈవి శ్రీనివాస్ లు బెంగుళూర్ కు బయలు దేరి వెళ్లారు.