14-05-2025 12:00:00 AM
మున్నూరు కాపు సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కొండా దేవయ్య
కామారెడ్డి, మే 13 (విజయక్రాంతి): త్వరలో రాష్ర్ట మున్నూరు కాపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు కాపు సంఘం రాష్ర్ట అధ్యక్షులు కొండ దేవయ్య తెలిపారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సబ్ కమిటీ సమావేశం జిల్లా మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ పటేల్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మే 4న రాష్ర్ట కార్యవర్గం పదవీకాలం పూర్తయిందని త్వరలోనే రాష్ర్ట మున్నూ రు కాపు నూతన కార్యవర్గం అనుకోవడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా మున్నూరు కాపుసంఘం ప్రధాన కార్యదర్శి పెట్టి గాడి అంజయ్య మండల కోఆర్డినేటర్ వెంకటరాజు రమేష్ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ భిక్కనూరు మండలం ప్రధాన కార్యదర్శి ముదాం శ్రీధర్ పటేల్ కోశాధికారి కుంటి ఆంజనేయులు ఉపాధ్యక్షులు సంకరి రాజలింగం పాల్గొన్నారు.