20-12-2025 08:06:21 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణ ప్రాంగణంలో ప్రయాణికులు సౌలభ్యం కొరకు దోమకొండ గడి కోట ట్రస్ట్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మూత్రశాలలు నిరూపయోగంతో ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వచభారత్ లో భాగంగా 2020 సంవత్సరంలో స్వచ్చ దోమకొండ, ఉత్తమ గ్రామ పంచాయతీ బహుమతి 2021లో స్వచ్చ సర్వేక్షన్ గ్రామీణ అవార్డు 2023 లో పొందిన దోమకొండ గ్రామ పంచాయతీ బస్ స్టాప్ ప్రాంతంలో ఆనంద్ భవన్ ముఖద్వారం, చుట్టూ ప్రక్కల ప్రాంతంలో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించలేకపోవడం విచారకరం.
మండల కేంద్రంలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణ ప్రాంగణంలో ప్రయాణికుల సౌలభ్యం కొరకు దోమకొండ గడి కోట ట్రస్టు వారు సుమారు 7 లక్షల రూపాయలతో కార్పొరేట్ హంగులతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మూత్రశాలలు నిరుపయోగంగా ఉండడంతో ప్రయాణికులు, బస్టాండ్ సమీప వ్యాపారస్తులు వినియోగదారులు, ప్రజలు ఆనంద్ భవన్ ముఖద్వారా గేటు ముందు ముత్రా విసర్జన చేయడంతో దోమలు, పందులు స్వైరా విహారం చేస్తున్నాయి.
బస్టాప్ ముందు గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ లో ఉన్న వారు సమీపవాసులు ముక్కుపుటాలు ఏగిరేయక తప్పడం లేదు ఆనంద్ భవన్ ముఖద్వారం గేటు ముందు ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రవేశ ముఖద్వారం ఉండడం విశేషం, మూడుసార్లు ఉత్తమ బహుమతి పొందిన గ్రామపంచాయతీకి ఆనంద్ భవన్ ముఖద్వారం కూతవేటు దూరంలో ఉండడం గమనార్హం... ! ఆనంద్ భవన్ ముఖద్వారం అపరిశుభ్రత కోరలోంచి విముక్తి కలిగేనా ? అధికారుల స్పందన వేచి చూడాలి.