20-12-2025 07:59:45 PM
కోదాడ: కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో శనివారం బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ , ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మూడవ సంవత్సరం చదువు తున్న విద్యార్థినులకు, టాస్క్ నిపుణులు ఎం. వెంకటేష్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగినది. ఈ శిక్షణ తరగతులలో విద్యార్థి నులకు పోటీ పరీక్షలలో అప్టిట్యూడ్ మరియు రీజనింగ్ ఏవిధంగా ఉపయోగ పడుతుందో ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా విద్యార్థి నులకు అవగాహనా కల్పించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థినులు వివిధ నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడు మాత్రమే ఉన్నత ఉపాధి అవకాశాలు అందుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, విభగాదిపతి స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.