08-11-2025 07:26:11 PM
సర్వోత్తంరెడ్డి, వేణారెడ్డి
సూర్యాపేట (విజయక్రాంతి): హరిహర పుత్ర అయ్యప్పస్వామి దీక్ష నూతన జీవన విధానానికి నాంధీ పలుకుతుందని ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, మార్కెట్ కమిటీ కొప్పుల వేణారెడ్డిలు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్- శిరీష దంపతుల నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజను సంగయ్య గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో వారు పాల్గొని మాట్లాడుతూ అయ్యప్ప స్వామికి నిర్వహించే పూజల్లో పడిపూజ ఎంతో విశిష్టమైనదన్నారు.
అనంతరం స్వాములకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎలిమినేటి రమేష్- ఉమా దంపతులు, చివ్వెంల మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ షేక్ జహీర్, పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు చెంచల నిఖిల్ నాయుడు, ఎర్రంశెట్టి సతీష్, పలువురు అయ్యప్ప మాలాధారణ స్వాములు పాల్గొన్నారు.