03-08-2025 06:22:55 PM
రామగుండం,(విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల ఖర్చు చేస్తే మన ప్రాంతంలో ఒక ఎకరాకు సాగు నీరు అందలేదని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. మహిళల అభివృద్ధి కోసం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో లక్షాధికారుల చేయాలని లక్ష్యంతో పని చేశామని, నేడు మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, బండ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం కోసం గతంలో అనేక ధర్నాలు చేశామని, ప్రస్తుతం గత ప్రభుత్వాల తప్పిదాలను సరి చేస్తున్నామని, టెయిల్ ఎండ్ ప్రాంతాలకు సాగు నీరు స్థిరికరణ కోసం పత్తిపాక రిజర్వాయర్ ఎన్ని కోట్ల ఖర్చు చేసినా నిర్మిస్తామని, కోటిన్నర రూపాయల నిధులు మంజూరు చేసే సర్వేకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు.