calender_icon.png 3 August, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా స్నేహితుల దినోత్సవం వేడుకలు

03-08-2025 06:28:27 PM

మందమర్రి,(విజయక్రాంతి): స్నేహితుల దినోత్సవాన్ని పట్టణంలో యువకులు చిన్నారులు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజున స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు. దీనిలో  భాగంగా ఆదివారం రోజున స్నేహితుల దినోత్సవం స్నేహితులు ఆనందోత్సహలతో జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పిల్లలు, యువకు లు, పెద్దలు వయసుతో సంబంధం లేకుండా స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు. స్నేహితులంతా ఒకరికొకరు స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ కేకును కట్ చేసి వేడుకలు నిర్వహించారు. బంధుత్వాల కన్నా స్నేహ బంధం గొప్పదని చాటుతూ పలువురు వేడుకలు నిర్వహించారు.