calender_icon.png 3 August, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓసి క్లబ్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

03-08-2025 06:16:44 PM

సీపీఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓసి క్లబ్ ను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఓసి క్లబ్ పరిరక్షణ కోసం కొద్దిరోజులుగా సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్ ఆరోపించారు. సోమవారం ఈ విషయంపై మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పట్టణంలో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

పట్టణ ప్రజలు ఓసి క్లబ్ పరిరక్షణ కోసం మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, వెలుగు శ్రావణ్, ఆబోతు అశోక్, జలగం ప్రవీణ్, మంద శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఓసి క్లబ్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో రేపు ఆగస్టు 4న సోమవారం రోజు చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జయప్రదానికై సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నేడు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పట్టణ ప్రధాన వీధుల గుండా పలు కాలనీలలో సెంటర్లలో ప్రచారం నిర్వహిస్తూ బైక్ ర్యాలీ కొనసాగించడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్ మాట్లాడుతూ... ప్రభుత్వం తక్షణమే ఓసి క్లబ్ ను స్వాధీనం చేసుకోవాలని దశలవారీగా ఉద్యమాలు నిర్వహిస్తున్నామని రేపు చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వందలాదిగా పాల్గొని కలెక్టరేట్ ను ముట్టడించాలన్నారు. ఓసీ క్లబ్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగించాలన్నారు. గత పదివేల టిఆర్ఎస్ పాలనలో నాడు అధికార ప్రజాప్రతినిధులు కబ్జా చేయాలని చూస్తే ఆధారాలతో సహా నాడు సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి బయట పెట్టాడన్నారు. ఈ సందర్భంగా రేపు జరిగే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు.