03-08-2025 06:05:32 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురం గ్రామంలో ప్రమాదవశాత్తు గోడపులి వ్యక్తి మరణించాడు. ఎస్ ఐ కోగిల తిరుపతి కథనం ప్రకారం మునగాల జంపన్న (45) అనే వ్యక్తి గుడి వద్ద మరమ్మతులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి మరణించాడని చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.