03-08-2025 06:26:09 PM
చండూరు,(విజయక్రాంతి): చండూర్ మున్సిపాలిటీలో శ్రీశ్రీ శ్రీ కాళికాదేవి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాళికాదేవి అమ్మవారిని దర్శించుకుని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఆయన చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బోనాల పండుగలు నిర్వహించడం చాలా సంతోషకరమని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. అనంతరం అమ్మవారి బోనమెత్తిన మహిళలను ఆత్మీయంగా పలకరించారు.