calender_icon.png 18 July, 2025 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలి

18-07-2025 12:00:00 AM

గద్వాల టౌన్, జూలై 17 : జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తరణ లక్ష్యాలను సాధించి, రైతుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు.  గురువారం ఐ.డి.ఓ.సి కాన్ఫరెన్స్ హాల్  నందు ఉద్యాన వాన శాఖ ఆధ్వర్యంలో జిల్లా మిషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల ఆదాయం పెరిగేలా ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆయిల్ పామ్ తోటల పెంపక విస్తీర్ణం పెంచడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సాగు కోసం రైతులను గుర్తించి అవగాహన కల్పించాలని, సబ్సిడీలు, అంతర పంటల ఆదాయం, డ్రిప్ రాయితీలు తదితర వివరాలను రైతులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అక్బర్ భాష, వ్యవసాయ అధికారి సక్రియా నాయక్, పరిశ్రమల శాఖ జి.యం. రామ లింగేశ్వర్ గౌడ్, కో ఆపరేటివ్ అధికారి శ్రీనివాసులు, జిల్లా మార్కెటింగ్ అధికారి పుషమ్మ, ఏడీఏ సంగీత లక్ష్మి, ఫారెస్ట్ అధికారి పర్వేజ్ అహ్మద్, పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ మోహన్, ఉద్యానవాన,వ్యవసాయ శాఖ, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.