calender_icon.png 18 July, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యాధికారులపై ఎమ్మెల్యే గరం.. గరం..!

18-07-2025 12:00:00 AM

  1. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక్కరే స్టాఫ్ నర్స్ ఉంటే ఎలా.?

వైద్యులను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు ఎమ్మెల్యే ఫోన్ కాల్

నాగర్ కర్నూల్ జూలై 17 విజయక్రాంతి : హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి తెలకపల్లి మీదుగా వెళుతుందని వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సామాన్య మధ్యతరగతి రోగులతో పాటు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం తెలకపల్లి మండల ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనకి చేసిన ఆయన రికార్డులు పరిశీలించి రాత్రి వేళల్లో చిన్నచిన్న కారణాలు చూపి వైద్యులు, ఇతర సిబ్బంది విధులకు డుమ్మా కొట్టడం ఏంటని ఆయన మండిపడ్డారు.

వెంటనే సంబంధిత అధికారులు సక్రమంగా డ్యూటీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి కి ఫోన్ లో విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యం పైనే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న వేళ వైద్య అధికారులు సిబ్బంది విధులకు హాజరు కాకపోతే ఎలా అంటూ ఆయన ఆగ్రహంవ్యక్తంచేశారు.