18-07-2025 12:00:00 AM
హన్వాడలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు
హన్వాడ జూలై 17 : పండుగ సాయన్న చరిత్ర భవిష్యత్తు తరాలకు దిక్సూచి అంటూ హన్వాడ మండల బహుజన నాయకులు స్పష్టం చేశారు. పండుగల సాయన్న జయంతి ఉత్సవాలలో భా గంగా గురువారం మండల కేంద్రంలోని ఆ యన విగ్రహం వద్ద పండుగ సాయన్న మండల కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పం డుగ సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
పండుగ సాయన్న కమిటీ మండల అ ధ్య క్షుడు పల్లెమోని యాదయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మ హేందర్, టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, బిజెపి పార్టీ అధ్యక్షుడు లింగమయ్య, సిపిఎం పార్టీ కార్యదర్శి లక్ష్మ య్య, నాయకులు కొండ లక్ష్మయ్య, బోయిని చెన్నయ్య, రమణారెడ్డి, వెంకన్న, వన్నాడ అంజన్న, ప్రభాకర్, జిల్లెల్ల తేజ వర్ధన్ లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
పండుగల సాయన్న ఆశయాలకు అనుగుణంగా బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా రాబోయే రోజుల్లో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బహుజనుల్లోని యువత పండుగ సాయన్న చరిత్రను పూర్తిగా తీసుకొని సమాజ మేలు కోసం కృషి చేయాలన్నారు. వెనుకబడిన వర్గాల ప్రజలు రాజకీ యంగా, ఆర్థికంగా నిలదొక్కుకునేలా సమిష్టిగా పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నరేందర్, మాజీ ఎంపీపీలు బాలరాజు, వడ్ల శేఖర్, పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ కృష్ణయ్య గౌడ్, నాయకులు కొండ బాలయ్య, కొండ బుచ్చయ్య, జంబులయ్య, ఎన్.శ్రీనివాసులు, మల్లేష్, రామచంద్రయ్య, పాలమూరు యాదయ్య, ప్రవీణ్ గౌడ్, రఘురాం గౌడ్, రవి, కేశవులు, కలీం, రాములు తదితరులు పాల్గొన్నారు.