17 April, 2026 | 11:23 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

చెరువుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలి

21-04-2025 10:17 PM

కాటారం,(విజయక్రాంతి): కాటారం మండల పరిధిలోని వివిధ చెరువులను రాత్రికి రాత్రే చెరువుల పరిరక్షణ నిబంధనలకు విరుద్ధంగా యాక్ట్ 1905ని ఉల్లంఘిస్తూ ఎటువంటి అనుమతులు లేకుండా కొంతమంది అక్రమార్కులు చెరువులను చేరబడుతున్నారని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ ఆరోపించారు. చెరువులను చెరబడుతున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఎమ్మార్వోకు వినతి పత్రం సమర్పించారు. సుమారు ఇప్పటివరకు మూడు కోట్ల రూపాయలకు పైచిలుకు విలువ చేసే మట్టిని తరలించారని, దీని ద్వారా చెరువులు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని అన్నారు.

కాటారం పరిధిలోని పోతులవాయ్ శివారులోని నల్ల గుంట, విలాసాగారం శంకరంపల్లి , దేవరంపల్లి, పరికిపల్లి చెరువులలో ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, తక్షణమే మట్టిని దోపిడీ చేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు.  సమగ్ర విచారణ జరిపి చెరువుల పరిరక్షణ నిబంధనలు ఉల్లంఘించి మట్టిని దోచుకుంటున్న వారిపై చట్టపరమైన కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కాటారం తహసిల్దార్ కి ఇచ్చిన వినతి పత్రంలో తెలిపినట్లు ఆయన తెలియజేశారు. అధికారులు పట్టించుకోకపోతే చెరువుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి తిరుపతి, బొడ్డు కిషో,ర్  రజనీకాంత్, నరేష్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.