calender_icon.png 17 October, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి

16-10-2025 09:49:56 PM

అలంపూర్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కూలీలకు పనులు కల్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు టెక్నికల్ అసిస్టెంట్లకు సూచించారు గురువారం అదనపు కలెక్టర్ నర్సింగరావు గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంతో పాటు కలుకుంట్ల గ్రామాన్ని సందర్శించి ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ముందుగా మండల కేంద్రంలో నర్సరీలను పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి గ్రామపంచాయతీలో ఉపాధి కూలీలకు పనులు కల్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం చెన్నిపాడు గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారో ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారులు  తప్పకుండా సమయపాలన పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాఘవ, టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.