calender_icon.png 17 October, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇరవై వార్డులుగా జిన్నారం మున్సిపల్..

16-10-2025 09:50:09 PM

డ్రాఫ్ట్ విడుదల చేసిన కమిషనర్ తిరుపతి..

జిన్నారం: నూతనంగా ఏర్పడిన జిన్నారం మున్సిపాలిటీని అధికారులు ఇరవై వార్డులుగా విభజించారు. ఇరవై వార్డుల డెలిమిటేషన్ డ్రాఫ్ట్ ను కమిషనర్ తిరుపతి గురువారం విడుదల చేసి కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. జిన్నారం మండలం పది గ్రామాలుగా ఉండగా ఇటీవల మున్సిపల్ గా ఏర్పాటైంది. కాగా పది గ్రామాలతో ఏర్పడిన మున్సిపల్ లో ఇరవై వార్డులను విభజించారు. జిన్నారంలో 4, ఊట్లలో 2, మంగంపేటలో 1 నల్తూరులో 2, జంగం పేటలో 1, కొడకంచిలో 2, రాళ్లకత్వలో 1, శివనగర్ లో 3, అండూర్ లో 2, సోలక్ పల్లిలో 2 వార్డులను విభజించారు. దీనిపై అభ్యంతరాలు సలహాలను ఈనెల 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు రాతపూర్వకంగా తెలపాలని కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.