calender_icon.png 7 October, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పకడ్బందీగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చర్యలు

07-10-2025 12:00:00 AM

 వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

వరంగల్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతునట్లు  పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. సోమవారం హనుమకొండ లోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై  వరంగల్, హనుమకొండ,  జనగామ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, స్నేహ శబరీష్, రిజ్వాన్ బాషా షేక్, డిసిపిలు, ఏసీపిలు, జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా  నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లు, సమస్యాత్మక  పోలింగ్ కేంద్రాల గుర్తింపు, చెక్ పోస్టుల ఏర్పాటు, బందోబస్తు, స్ట్రాంగ్ రూమ్ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై పోలీస్ కమిషనర్, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీసీపీలు, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈవోలు, ఆర్డీవోలు, ఏసీపిలతో సమీక్షించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ హనుమకొండ వరంగల్ జనగామ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను  గుర్తించామని పేర్కొన్నారు.  ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి సంధ్యారాణి, జడ్పీ సీఈఓ లు రవి, రామ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారులు కల్పన, లక్ష్మీ రమాకాంత్, సస్వరూప, ఆర్డిఓ ఉమారాణి, ఇతర అధికారులతో పాటు ఏసీపీలు పాల్గొన్నారు.