12-09-2025 12:00:00 AM
ముత్తారం మండలంలో అడవి శ్రీరాంపూర్‌లో ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
ముత్తారం, సెప్టెంబర్-11 (విజయ క్రాంతి) కృత్రిమ మేధస్సు పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటు న్నామని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమల శాఖ మం త్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు.గురువా రం మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కో య శ్రీ హర్షతో కలిసి మండలంలోని అడ వి శ్రీరాంపూర్ గ్రామంలో పాఠశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబ్, ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఎల్‌ఎంఎస్ పుస్తకాల పంపిణీ, టి ఫై బర్ ద్వారా గ్రామానికి ఏర్పాటుచేసిన సీసీటీవీ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ప్రతి ఇంటి వద్ద టి ఫైబర్ కనెక్షన్ అందించడం జరిగిందన్నారు. పాఠశాలలో ఏఐ ల్యాబ్ ద్వారా ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందుతుందని, హైద రాబాద్ లోని ప్రముఖ ప్రైవేటు పాఠశాలల కు దీటుగా మారుమూల ముత్తారం ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యం కల్పించేందుకు ఏఐ కం ప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని,భవిష్యత్తులో వచ్చే సాంకేతికతను అల వాటు చేసుకుంటూ పోటీ ప్రపంచానికి వి ద్యార్థులను సిద్ధం చేయాలన్నారు.
మంథని నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయిలో డిజిటల్ క్లాస్ లను ఏర్పాటు చేయాలని, దీని కోసం సిఎస్‌ఆర్ నిధులు వినియోగిస్తామని అన్నారు. రోబోటిక్స్, డ్రైవర్ లెస్ కార్లు వంటి సాంకేతిక అంశాలు పిల్లలకు నేర్పాలని అన్నారు. మంథని లో ఉన్న ప్రోటో టైపింగ్ ఇన్నోవేషన్ సెంటర్ ను విద్యార్థులు వాడుకోవాలని మంత్రి సూ చించారు.ఏఐ టూల్స్ (కృత్రిమ మేధస్సు) పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమ లు చేస్తుందన్నారు.
టీచర్స్ కు కూడా ఏ.ఐ బోధన పై శిక్షణ అందిస్తామని, పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్ రావాల్సిన అవసరం ఉందని, దీని కోసం అవసర మైన చర్యలు తీసుకుంటామని,అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసింగ్ అందజేశారు. మరియు అడవి శ్రీరాంపూర్ గ్రామపంచాయతీ లోని టీ ఫైబర్ ద్వారా హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్ కు అనుసంధానమైన టెక్నాలజీని ప్రారంభించారు.
దర్యాప్పూర్ లో రూ.2 కోట్ల 80 లక్షల, పోతారం లో రూ. 2 కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న సబ్ స్టేషన్ పనులకు మం త్రి శంకుస్థాపన ముత్తారం మండలంలోని దర్యాప్పూర్ వద్ద రూ. 2 కోట్ల 80 లక్షల, పోతారం లో రెండు కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న సబ్ స్టేషన్ పనులకు గురువారం మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ముత్తారం తాసిల్దార్ కార్యాల యంలో 18 మంది కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
డి ఎం ఎఫ్ టి నిధుల ద్వారా ముత్తారం మండలంలోని పలు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల మరమత్తు కోసం రెండు కోట్ల 81 లక్షలతో చేపట్టిన పనులను మంత్రి శంకుస్థాపన చేశా రు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ గౌడ్, ఆర్.డి.ఓ. సురేష్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మాది జెడ్పిటిసి చొప్పర్ సదానందం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ,
ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, డైరెక్టర్లు, సింగల్ విండో చైర్మన్ అల్లాడి యాదగి రిరావు, వైస్ చైర్మన్ కొమురయ్య డైరెక్టర్లు, ఎంపీడీవో సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జవీద్, అశోక్ చారి, ప్రభాకర్, గీతా రాణి, బుచ్చం రావు, తాటిపాముల శంకర్, డా. చారి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.