12-09-2025 12:00:00 AM
అమరులైన అటవీశాఖ అధికారులకు నివాళులు
కామారెడ్డి, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): అమరులైన అటవీశాఖ అధికారుల ను స్ఫూర్తిగా తీసుకొని విధులు నిర్వహించాలని జిల్లా అటవీశాఖ అధికారి భోగ నికిత అన్నారు. గురువారం ఆటో షాప్ ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమరులైన అటవీశాఖ సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా ఆటో శాఖ అధికారి భోగ నికిత మాట్లాడుతూ అడవి శాఖ సిబ్బంది అధైర్యపడవద్దని సూచించారు. విధి నిర్వహణలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయని తెలిపారు. ప్రాణాలకు సైతం తెగించి విధులు నిర్వహించి అమరులైన అటవీశాఖ అధికారుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డి ఓ రామకృష్ణ, ఎఫ్‌ఆర్‌ఓ రమేష్, కామారెడ్డి డివిజన్లోని ఆటవి శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.