calender_icon.png 7 October, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల ప్రతిభ అభినందనీయం

07-10-2025 12:00:00 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్6(విజయక్రాంతి): జిల్లాలో మైనారిటీ విద్యాసం స్థలలో విద్య అభ్యసించి వైద్య విద్య (ఎం.బి. బి.సి.)లో సీట్లు సాధించడం అభినందనీయమని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం  కలెక్టర్ ఛాంబర్‌లో వైద్య విద్య లో సీట్లు సాధించిన విద్యార్థులను శాలువా, మొక్కలతో అభినందించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు.

5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కాగజ్ నగర్ లోని బాలుర మైనారిటీ విద్యాసంస్థలలో చదివి వైద్య విద్యలో సీటు సాధించిన సయ్య ద్ అంజద్ అలీ, సయ్యద్ ఇక్రాముద్దీన్, సయ్యద్ అబుజార్ లను అభినందించారు. సీట్లు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మంచి విద్యను అభ్యసించి వైద్యులుగా ఆసిఫాబాద్ జిల్లాలో సేవలందించాలని కోరారు.

వీరి ప్రతిభ విద్యార్థులకు ఆదర్శనీయమని, తల్లిదండ్రులు మైనారిటీ గురుకులాలలో తమ పిల్లలను చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ నదీమ్, మైనారిటీ అకాడమిక్ సమన్వయకర్త రిజ్వాన్, విజిలెన్స్ అధికారి తాహెర్, కళాశాల పూర్వ ప్రిన్సిపల్ జబ్బర్ పాల్గొన్నారు.