calender_icon.png 7 September, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టార్మ్ వాటర్ డ్రైన్ క్లీనింగ్

05-09-2025 01:53:52 AM

  1. రోబోటిక్ టెక్నాలజీతో నిర్వహణ

సర్కిల్  పైలట్ ప్రాజెక్ట్‌గా జీహెచ్‌ఎంసీ ప్రారంభం

కమిషనర్ కర్ణన్ వెల్లడి

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): వర్షాకాలం వచ్చిందంటే చాలు స్టార్మ్ వాటర్ డ్రైన్‌లు పొంగిపొర్లడం, ట్రాఫిక్ జామ్‌లు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవ్వడం వంటి వార్తలు వింటూనే ఉంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సాంకేతికత దన్నుగా స్మార్ట్ పరిష్కారం చూపనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షపు నీటి కాలువల శుభ్రతకు జీహెచ్‌ఎంసీ రోబోటిక్ సాంకేతికతను ఉపయోగించుకుంటుంది.

మొట్టమొదటగా సర్కిల్‌ెే-12లో పైలట్ ప్రాజెక్ట్‌గా స్టార్మ్ వాటర్ డ్రైన్ క్లీనింగ్‌ను ప్రారంభించింది. అధునాతన సీసీటీవీ కెమెరాలు ఉన్న రోబోటిక్ యంత్రాల ద్వారా ప్రధాన రోడ్డు క్రాసింగ్‌లో  వర్షపు నీటి కాలువల శుభ్రత చేపట్టగా, చీఫ్ ఇంజనీర్ (మెయింటెనెన్స్) సహదేవ్ రత్నాకర్ ఈ విధానంలో క్లీనింగ్ ప్రక్రియను బుధవారం రాత్రి మెహదీపట్నం ఎన్‌ఎండీసీ జంక్షన్‌లో పరిశీలించారు.

కాలువలలోని అడ్డంకులను ఖచ్చితంగా గుర్తించి, తొలగించడం, బురదను వేగంగా, సమర్థవంతంగా అత్యంత వేగంగా తొలగించడం, వర్షాల సమయంలో నీటి నిల్వలను తగ్గించి, డ్రైనేజ్ సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఫీల్ స్టాఫ్, ప్రజల భద్రతకు ఎలాంటి హాని జరగకుండా కఠిన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ క్లీనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తారు.

పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ విధానం సఫలీకృతమైతే  జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని సర్కిల్లలో అమలు చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ కమిషనర్ మాట్లాడుతూ.. ఈ విధానం విజయవంతం అయితే వాటర్ డ్రైన్‌లు పొంగిపొర్లడం, ట్రాఫిక్ జామ్‌లు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ఘటనలు చాలా వరకూ తగ్గుతాయని చెప్పారు.