calender_icon.png 7 September, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేగంగా రోడ్డు సేఫ్టీ డ్రైవ్

05-09-2025 01:54:29 AM

-రాత్రిపూట కూడా కొనసాగుతున్న పనులు

-ఇప్పటి వరకు 11,442 గుంతల పూడ్చివేత

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): హైదరబాద్ నగర వ్యాప్తం గా వర్షకాలంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపడుతున్న రోడ్డు సేఫ్టీ డ్రైవ్ వేగంగా కొనసాగుతోంది. గణేష్ ప్రతిమల నిమజ్జనం గడువు సమీపిస్తున్న నేపథ్యంలో జీ హెచ్‌ఎంసీ డ్రైవ్‌ను మరింత వేగిరం చేసింది.

రోడ్డు భద్రత చర్యలలో భాగంగా గుంతల పూడ్చివేత పనులు, క్యాచ్ పిట్ రిపేర్లు, రోడ్ల మరమ్మత్తు పనులు, ప్యాచ్ వర్క్ పనులు, కవర్ రీప్లేస్మెంట్లు, సెంట్రల్ మీడియన్ మరమ్మతులు నిరంతరంగా కొనసాగుతున్నా యి. కమిషనర్ ఆర్‌వి కర్ణన్ మార్గదర్శనం మేరకు జీహెచ్‌ఎంసీ మెయిటనెన్స్ చీఫ్ ఇం జనీర్ సహదేవ్ రత్నాకర్ క్షేత్రస్థాయిలో డ్రైవ్ ను పర్యవేక్షిస్తున్నారు.

గురువారం నాటికి నగరంలో మొత్తం 14,050 గుంతలు గుర్తించగా.. వాటిలో 11,442 గుంతలకు మరమ్మ తులు చేశారు. ఇప్పటి వరకు 574 క్యాచ్ పిట్స్ రిపేర్లు, 328 కవర్ రీప్లేస్మెంట్లు, 12 సెంట్రల్ మీడియన్ మరమ్మతులు పూర్తి అయ్యాయి. రోడ్డు మరమ్మత్తు పనులు వేగంగా పూర్తిచేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ ఇంజనీరింగ్ అధికారుల ను ఆదేశించారు.