ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ప్ర భుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీ సుకుంటామని కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. మహబూబాబాద్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్ అనంతారం రోడ్డు, సర్వేనెంబర్ 255 లోనీ సుమారు 12 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని ఆక్రమించిన భూమిని ప్రభుత్వ నిబం ధనల ప్రకారం మంగళవారం ఉదయం స్వా ధీనపరచుకోవడం జరిగిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే రెవె న్యూ యాక్ట్ ప్రభుత్వ నిబంధనలు, ద్వారా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ప్రభుత్వ భూములు, చెరువులు, నాళాలు, పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ రెవెన్యూ, ల్యాండ్ సర్వే, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, తదితర శా ఖల నుండి భూముల పరిరక్షణ కోసం కమి టీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామన్నా రు. ప్రభుత్వ భూమిని స్వాధీన పరుచుకున్న కార్యక్రమంలో తహసిల్దార్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.






