calender_icon.png 2 May, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే 3న కేఎల్ వర్సిటీ క్యాంపస్ ప్లేస్‌మెంట్ సక్సెస్ మీట్

01-05-2025 01:03:14 AM

  1. అతిథులుగా గూగుల్, జేపీ మోర్డాన్ కంపెనీ ప్రతినిధులు
  2. రూ.75 లక్షల వార్షిక ప్యాకేజీ పొందిన కేఎల్‌హెచ్ విద్యార్థి

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాం తి): క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు అత్యుత్తమ వార్షిక ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందారని వర్సిటీ డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు. హైదరాబాద్‌లోని యూనివర్సిటీ అ డ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో బుధవారం ఏ ర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేఎల్ విద్యార్థులు పొందిన క్యాంపస్ ప్లేసిమెంట్స్ వివరాలను తెలియచేశారు.

తమ యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్ ప్లేసెమెంట్స్‌లో సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకునేందుకు మే 3వ తేదీన హైదరాబాద్‌లోని అజీజ్ నగర్ క్యాంపస్‌లో సక్సెస్ మీట్ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో గూగుల్, జేపీ మోర్గాన్ వంటి ప్రముఖ కంపెనీలతో పాటు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారని చెప్పారు.

ఈ ఏడాది రూ.78 లక్షల వార్షిక ప్యాకేజీతో తమ విద్యార్థి ఉద్యోగం సాధించటం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు వార్షిక ప్యాకేజీతో సూపర్ డ్రీమ్, డ్రీమ్ కంపెనీలలో తను విద్యార్థులు ప్లేస్ అయ్యారని అన్నారు. ఈ ఏడాది జర్మనీ, జపాన్, సింగపూర్, దుబాయ్, మలేషియా వంటి దేశాల్లో అంతర్జాతీయ ప్లేసెమెంట్స్ దక్కించుకున్నారని పేర్కొన్నారు.

కేఎల్ విద్యార్థులు తమ 3వ సంవత్సరంలోనే జాతీ య, అంతర్జాతీయ కంపెనీలలో ఇంటర్నషిప్ చేస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది వందలకు పైగా కంపెనీలు క్యాంపస్‌కు వచ్చి విద్యార్థులను ఇంటర్వ్యూ చేశాయని పేర్కొన్నారు.